ఒడిశా లాంటి చర్యలు తీసుకోవాల్సింది

19 Dec, 2014 14:39 IST|Sakshi

హైదరాబాద్:తుపాను ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందు జాగ్రత్త చర్యలు బాగా తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. అక్కడ ముందుగానే విద్యుత్ సరఫరా లైన్లను కట్ చేశారని, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుని ఉంటే బాగుండేదని ముత్యాల నాయుడు అభిప్రాయపడ్డారు.

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు హుద్హుద్ తుపానుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి నష్ట నివారణ కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ఒక్క విశాఖపట్నానికే వచ్చారు తప్ప ఆయన గ్రామీణ ప్రాంతాలకు రాలేదని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తృతంగాపర్యటించి నష్టాన్ని స్వయంగా అంచనా వేశారని, సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించారని ముత్యాలనాయుడు తెలిపారు.

మరిన్ని వార్తలు