నిధులు సరే..అభివృద్ధేది?

31 May, 2014 03:08 IST|Sakshi
  •      అసంపూర్తిగా కారిడార్ పనులు
  •      తీరు మారని పురాతన ఆలయాలు
  •      అలంకారప్రాయంగా అతిథి భవనాలు
  •  శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్:  భారతీయ సంస్కృతిని ప్రతిభిం భించే పురాతన ఆలయాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించినా ఫలితం మాత్రం కని పించడం లేదు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి 2008లో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి కేంద్ర టూరిజం శా ఖ నడుం బిగించింది. తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా వరకు ఒక జోనుగా గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

    తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంకు వచ్చే భక్తులు సమీపంలోని పురాతన ఆలయాలను సందర్శించేలా అభివృద్ధి చేసేందుకు చిత్తూరు జిల్లాకు రూ.21 కోట్లు కేటాయించింది. టూరి జం కారిడార్ పేరిట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూ.7.55 కోట్లు కేటాయించింది. కొద్ది రోజులకే వై ఎస్ మరణించడం, ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో ఆరే ళ్లు గడిచినా పనులు అతీగతి లేదు. ఈ పథకం కింద నిర్మించిన అతిథి భవనాలు ప్రారంభానికి నోచుకోక అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.
     
    తొండమనాడుకు రూ.2.53 కోట్లు
     
    శ్రీకాళహస్తి మండలం తొండమనాడుకు సమీపంలోని ఎగువవీధి శ్రీప్రసన్న వెం కటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి రూ. 2.53 కోట్లు కేటాయించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ప్రసన్న వెంకటేశ్వరస్వామి కూర్చుని ఉండడం ఈ ఆల యం ప్రత్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, వసతి సముదాయం, స్వాగత తోరణం, కోనే రు పునర్ నిర్మాణం, మంచినీటి సదుపాయం తదితర పనులు చేయాల్సి ఉన్నా అసంపూర్తిగా ఆగిపోయాయి.
     
    బొక్కసంపాళెంకు రూ.2.02కోట్లు
     
    శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం లోని శ్రీకోదండరామేశ్వరస్వామి ఆల యాన్ని రూ.2.02 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉంది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. అందుకే కోదండరామేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు. కోనేరు, ఆలయ ప్రాంగణం అడుగుభాగంలో చలువరాళ్ల ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
     
    శ్రీకాళహస్తీశ్వరాలయాభివృద్ధికి రూ.1.07 కోట్లు

    శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి టూరిజం శాఖ రూ.1.07 కోట్లు కేటాయిం చింది. ఈ నిధులతో మరుగుదొడ్లు, వస తి కేంద్రం, సమాచార కేంద్రం ఏర్పా టు, మంచినీటి సదుపాయం వంటి ప నులను నామమాత్రంగా పూర్తి చేశారు.
     
    గుడిమల్లంకు రూ.1.92 కోట్లు
     
    ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెల సిన శ్రీపరశురామేశ్వరాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.1.92 కోట్లు కేటాయించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లు ఒకే లింగంలో ఉండడం ఇక్కడ ప్ర త్యేకత. ప్రహరీ గోడ నిర్మాణం, పిల్లల పార్కు, మరుగుదొడ్లు, యాత్రికుల విశ్రాంతి భవనం, సమాచార కేంద్రం, స్వాగత తోరణం, కోనేరు పునర్ నిర్మా ణం, మంచినీటి సౌకర్యం తదితర పను లు చేయాల్సి ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడం, వారి నుంచి అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి పనుల ఊసేలేదు. పురాతన దేవాలయాల పరిరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్న కేంద్ర ప్రభుత్వం పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులను అడిగితే నిధుల కొరత వల్లే పనులు ఆగిపోయాయని సమాధానం చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు