FactCheck: మీరు సుద్దులు చెబితే ఎలా!?

3 Nov, 2023 03:42 IST|Sakshi

రుషికొండపై పర్యాటక శాఖ నిర్మాణాలపై రామోజీ విషపు రాతలు

అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవన నిర్మాణాలు చేపడుతున్నా నానాయాగీ

అన్యాయం, అక్రమం అంటూ గగ్గోలు

61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులుంటే, 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టుకు ప్రతిపాదన

పైగా ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లోనే..

అలాగే, ఏడు బ్లాకుల నిర్మాణానికి అనుమతులివ్వగా,  కట్టింది నాలుగు బ్లాక్‌లే..

అసలు ఇక్కడ భవనాలు కట్టింది టీడీపీ హయాంలోనే..

సాక్షి, అమరావతి :  విశాఖ అభివృద్ధి అంటే రామోజీరావును ఎక్కడలేని ఆవేశం ఆవహిస్తుంది. అంతేకాదు.. ఆందోళన, ఆవేదన.. అక్కసు కూడా. అందుకే ఈ మధ్య తరచూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ఎక్కడలేని విషం కక్కుతున్నారు. విశాఖలో భూ కబ్జాలంటూ నిత్యం అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి మరీ నానా రోత రాతలు రాసిపారేస్తున్నారు.

ప్రతిరోజూ ఇలా పచ్చి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేస్తారన్నది అయన గుడ్డి విశ్వాసం. ‘ఈనాడు’ ఆవిర్భావం నుంచి రామోజీరావు ఎంచుకున్న మార్గం కూడా ఇదే. కానీ, ఇప్పుడు ఆయన అనుకుంటున్న రోజులు కావు కదా.. ఆయన ఒకటంటే సోషల్‌ మీడియా ఆయన్ను పది అంటూ నగ్నంగా నిలబెడుతోంది. అయినా ఇవేవీ పట్టని ఆయన ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో.. నిస్సిగ్గుగా విశాఖపై చెలరేగిపోతున్నారు.

తాజాగా.. రుషికొండ మీద పర్యాటక శాఖ కట్టడాలపై రామోజీ బాధ వర్ణనాతీతం. తన ఆత్మబంధువు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు జరిగితే నోరెత్తని ఆయన.. ఇప్పుడు అన్ని అనుమతులతో రుషికొండలో పర్యాటక శాఖ నిర్మాణాలు చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి.. విశాఖలో భూకబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడిందెవరు? రుషికొండపై రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం..

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందడం రామోజీకి అస్సలు నచ్చడంలేదు. అందులోను కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర, విశాఖ నగరాభివృద్ధి అంటేనే ఆయన గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన విషపత్రికలో అడ్డగోలు కథనాల పరంపరను అచ్చేస్తున్నారు. నిజానికి.. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి, నిశిత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి, ఇతర అధికారులకు క్యాంపు కార్యాలయాలు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తన సిఫార్సులను నివేదించింది.

విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా భవనాలను పరిశీలించి కమిటీ తమ సిఫార్సులను అందజేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగ్, సమీపంలోనే హెలిపాడ్‌ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్టులు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది.

పైగా.. ముఖ్యమంత్రి రాకపోకల కారణంగా నగర వాసులకు ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామని కూడా తెలిపింది. ముగ్గురు సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఇలా నివేదిక ఇచ్చిందో లేదోం రామోజీరావు వెంటనే తన పైత్యానికి పదును పెట్టారు. ‘వేదికపై సుద్దులు..ం తీరంలో ఘోరాలు’ అంటూ గురువారం ఈనాడులో గగ్గోలు పెట్టారు. రుషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చేశారు.  

అన్ని అనుమతులతో..
కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సీఆర్‌జెడ్‌ అనుమతులు తీసుకుంది.. 
ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సిఫార్సులు తీసుకోవడంతో పాటు.. నిర్మాణంలో భాగంగా, అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు, అంతకుమించి పెద్దసంఖ్యలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ అనుమతి నుంచి అనుమతులు సైతం ఉన్నాయి..
జీవీఎంసీ నుంచి ఫైర్‌ సేఫ్టీ క్లియరెన్స్‌ లభించడంతో పాటు, భవనాల డిజైన్లకు ఆమోదం ఉంది..

..ఇలా ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కన్‌సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు, చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించి అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది.

 ఇక రుషికొండ వద్ద ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు కోసం ప్రతిపాదించింది కేవలం 3 శాతం మాత్రమే. 
61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులుంటే, 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే..
అలాగే, ఏడు బ్లాకుల నిర్మాణానికి అనుమతులివ్వగా, కట్టింది నాలుగు బ్లాక్‌లే..

కట్టడాలు ఈరోజు ప్రారంభించినవేం కాదు..
రుషికొండ మీద కట్టడాలు 1984లోనే ప్రారంభమయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వమే. సముద్రతీరంలో వాతావరణ పరిస్థితులతో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసివేసి కొత్తగా రిసార్టులను నిర్మించింది. మరి 1984లో కట్టిన నిర్మాణాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదా? అప్పుడు రుషికొండను తవ్వి, అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేయలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్లంతా అప్పుడేమయ్యారు? అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తే కరెక్టు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే తప్పు అవుతుందా.. రామోజీ?  

బాలకృష్ణ వియ్యంకుడి కబ్జాలపై మౌనం..
మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడుగా చంద్రబాబుకు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి అడ్డగోలుగా విశాఖలో భూకబ్జాకు పాల్పడితే కనీసం ఒక్క ముక్క వార్త కూడా ఈనాడులో రాయలేదు. ఎందుకంటే ఎంవీవీఎస్‌ మూర్తి టీడీపీ పెద్దల బంధువు కావడమే. విశాఖ నగరంలో ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో అత్యంత విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా మూర్తి స్వాహా చేసేశారు. అప్పటి సీఎం చంద్రబాబు సైతం నోరు మెదపలేదు.

విశేషం ఏమిటంటే.. ఈ కబ్జా అంతా రుషికొండకు సరిగ్గా ఎదురుగానే.. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.

ఏ కొండ మీద ఏముంది?
విశాఖ నగరంలో చాలా నిర్మాణాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి.  ఏఏ కొండ మీద ఏమేం ఉన్నాయంటే..
 డాల్ఫిన్‌ హిల్‌ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. ఇవి పూర్తిగా కొండవీుదే ఉన్నాయి. 
 సర్క్యూట్‌ హౌస్‌గా పిలిచే గవర్నర్‌ బంగ్లా కూడా కొండ మీదే ఉంది. 
 ఐటీ హిల్స్‌ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కొండల మీదే ఉన్నాయి.  మిలీనియం టవర్స్‌ ఉండేది ఈ కొండవీుదే. 
రామానాయుడు స్టూడియోస్‌ మొత్తం కొండల మీదే ఉంది. 
 ఇక రుషికొండకు సమీపంలో ఉన్న పెమా వెల్నెస్‌ సెంటర్‌ కూడా పూర్తిగా కొండవీుదే నిర్మించారు.

రామోజీ.. మీరుండేది కొండ మీదేనని మర్చిపోయారా!?
రుషికొండ మీద ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న రామోజీరావు నిజానికి ఎక్కడుంటున్నారు? ఆయన కట్టిన ఫిల్‌్మసిటీ ఎక్కడుంది? ఆ ఫిల్మ్‌ సిటీలో వివిధ నిర్మాణాలు వేటి మీద చేశారు? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే గురవింద సామెత గుర్తుకొస్తుంది. రామోజీరావు ఉంటున్న నివాసం పూర్తిగా కొండవీుదే కట్టారు. అవి పర్యావరణ ఉల్లంఘనలు కావా? ఫిల్‌్మసిటీ పేరిట ఈ పెద్ద మనిషి పదుల కొద్దీ అసైన్డ్, సీలింగ్‌ భూములు కబ్జాచేసిన వ్యవహారాలు మర్చిపోతే ఎలా? ఇక ఫిల్‌్మసిటీ నిర్మాణాలను పరిశీలిస్తే అన్నీ గుట్టల మీద కట్టినవే. కాదంటారా రామోజీ..

రుషికొండలో గీతం కాలేజీ పేరిట చేసిన భూముల కబ్జా
 గులాబీరంగులో ఉన్న 19.39 ఎకరాల కబ్జా భూమిని మొదటివిడతగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
 ఆకుపచ్చ రంగులో 4.74 ఎకరాల కబ్జా భూమిని రెండో విడతగా స్వాధీనం చేసుకుంది.
 ఎరుపు రంగు గళ్లతో ఉన్న భూమి ఇంకా కబ్జాలో ఉంది. కబ్జాచేసిన ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను స్పష్టంగా చూడొచ్చు. 

మరిన్ని వార్తలు