రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

21 Nov, 2019 04:12 IST|Sakshi
విజయనగరంలో నిర్వహించిన సోదాలలో గుర్తించిన చిన్నారులు

2,774 మంది పిల్లల గుర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం ఆపరేషన్‌ ముస్కాన్‌ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు 794 బృందాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేపట్టాయి. పోలీసులు, చైల్డ్‌లైన్, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ శాఖల సమన్వయంతో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపారు.

బాలబాలికల అదృశ్య ఘటనలు, చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఘటనలపై పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,774 మంది పిల్లలను గుర్తించగా వారిలో బాలురు 2,378, బాలికలు 396 మంది ఉన్నారు. వారిలో చిరునామా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిరునామా దొరకని వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు