తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

5 Jan, 2020 16:20 IST|Sakshi

సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠం కాంప్లెక్స్‌, నారాయణగిరి ఉద్యానవనం సహా నాలుగు మాడ వీదుల్లో 90 వేలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా వీవీఐపీల దర్శనానంతరం సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. ధనుర్మాసకైంకర్యాల అనంతరం తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు ఈ నెల 8వరకు అదే ద్వారా గుండా భక్తులను అనుమతించనున్నారు. కాగా స్వామి వారి సర్వదర్శనం మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో తిప్పనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేమయి వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు