తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

19 Nov, 2023 07:43 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలపల‌ ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,686 కాగా, తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 34,563.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్లు.

మరిన్ని వార్తలు