‘స్క్రిప్ట్‌ చదివేందుకే ఆయన బయటకు వచ్చారు’

5 Jan, 2020 16:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా స్థాయి మరిచి చంద్రబాబు దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను రాజకీయ నేతగా బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరుతామని ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావును పనికిమాలిన వాడు అంటూ చంద్రబాబు మాట్లాడారని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి : విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!)‘దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ చేసిన తప్పేంటి. మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. బాబు రాజకీయ కుట్రలో రాజధాని  రైతులు చిక్కుకోవద్దు. మూడు రాజధానులు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ ప్రతినిధులు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్‌నకు విశ్వసనీయత లేదు కానీ నారాయణ కమిటీకి విశ్వసనీయత ఉందా. రైతులందరికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారు. గరుడ పురాణం శివాజీ, పవన్ కల్యాణ్ బాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. ఏడు నెలలుగా జాడలేని గరుడ పురాణం శివాజీ బాబు స్క్రిప్ట్‌ చదివేందుకు బయటకు వచ్చారు’అని సుధాకర్ బాబు విమర్శించారు.

సంబంధిత వార్తలు :
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం

చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి

చంద్రబాబు దళిత ద్రోహి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎల్లో వైరస్ కోరలు పీకే మందు ఉంది’

‘డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’

ఓ వైపు సూక్తులు.. మరోవైపు రాజకీయాలు : అంబటి

కన్నీటిపర్యంతం.. రాజీనామా చేయండి!

సీఎం జగన్‌ చేతల మనిషి, ప్రచారానికి దూరం..

సినిమా

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం