మమ్మల్ని పట్టించుకోవడం లేదు

18 Dec, 2018 08:06 IST|Sakshi

శ్రీకాకుళం: ‘అన్నా.. ఈ నియోజకవర్గంలో దాదాపు 82 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. మా సంక్షే మం ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని నరసన్నపేట నియోజకవర్గం మబుగాంకు చెందిన షేక్‌ మదీనా జగన్‌కు చెప్పారు. ఎవరైనా చని పోతే అంత్యక్రియలకు కూడా ఇబ్బంది పడుతున్నామని, మీరు సీఎం అయ్యాక సమస్యలు పరిష్కరించాలని కోరారు.  

నువ్వే సీఎం కావాలి
‘బాబూ.. నీవు సీఎం కావాలి బాబు. మా లాంటి వారు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా పథకాలు తీసుకురావాలి’ అని అల్లిపురం గ్రామానికి చెందిన ఎడ్ల అసిరయ్య ఆకాంక్షించారు. ఆయన జగన్‌ను కలిసి మాట్లాడుతూ వైఎస్‌ తన పథకాల వల్ల అందరి గుండెల్లో నిలిచిపోయారని, అంత కంటే మంచి పాలన అందించాలని కోరారు.  

పెన్షన్‌ లేదు
‘నాయనా.. నా భర్త మరణించి ఆరేళ్లు అయింది. ఇంత వరకు నాకు వితంతు పెన్షన్‌ మంజూరు చేయలేదు’ అని జలుమూరు మండలం లింగావలస గ్రామానికి చెందిన బంగారి ఇల్లమ్మ జగన్‌కు తెలిపారు. ఎవరిని కలిసినా న్యాయం జరగడం లేదని, తనకు పెన్షన్‌ అందించాలని కోరారు.  

పొదుపు డబ్బు గల్లంతు
‘నాయనా.. నేను పోస్టాఫీసు, బ్యాంకులో పొదుపు చేసిన డబ్బు గల్లంతైంది’ అని బలిజిపేట మండలం అంపావల్లికి చెందిన వాస గురమ్మ జగన్‌కు తెలిపారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు