మత్స్యకారుల సంక్షేమాన్నిగాలికొదిలేశారు

3 May, 2018 07:44 IST|Sakshi

కృష్ణా జిల్లా: ‘అన్నా.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది’ అంటూ మచిలీపట్నం మండలం  చిన్నకరగ్రహారం గ్రామానికి చెందిన  మత్స్యకారుడు నడికుదుటి వెంకటేశ్వరరావు జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  జగన్‌ను కలసి సమస్య విన్నవించారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందితే మృతదేహం దొరికితేనే పరిహారం ఇస్తున్నారని, లేదంటే కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదన్నారు.

వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారని, దీని వల్లన కుటుంబ పోషణ కష్టంగా మారిందని వివరించారు. టీడీపీ ప్రభుత్వం వేటకు వినియోగించే బోట్లకు ఇన్సూరెన్స్‌ను రద్దు చేసిందని, ఫలితంగా తాము నష్టపోతున్నామని జగన్‌కు  వివరించారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు