హామీలు అమలు చేయడం లేదన్నా...

3 May, 2018 07:58 IST|Sakshi

కృష్ణా జిల్లా : అన్నా... ఈసీ ఏఎన్‌ఎంలుగా గత 15 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నాం. కొంత కాలం  రూ. 5000లు వేతనంగా ఇచ్చారు. ఇటీవల దాన్ని రూ. 10,000లకు పెంచారు. కానీ రికార్డుల్లో మాకు రూ. 26,000 వేతనం ఇస్తున్నట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నారు. శ్రమ మాది దోపిడీ ప్రభుత్వానిది. చాలీచాలనీ వేతనాలతో పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు పద్ధతికి మార్చి తరువాత రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా మాగురించి పట్టించుకోవడం లేదు.’ అని  ఏపి ఈసీ ఏఎన్‌ఎంల యూనియన్‌ తరపున ఎ.శ్యామసుందరి, కె.మరియమ్మ, పి.జి.సుమతి, ఎన్‌.నాగమల్లేశ్వరి సంకల్పయాత్రలో పాల్గొన్న  జగన్మోహన్‌రెడ్డిని కలిసి సమస్య వివరించారు.  రాష్ట్రంలో 700 మందికిపైగా ఈసీ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్నామని, జీవో నంబరు 27 రద్దు చేసి 2015 పీఆర్‌సీ ప్రకారం జీతాలు అందేలా చూడాలని జననేతకు విన్నవించారు. ఏఎన్‌ఎంలతో పాటు ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లను క్రమబద్ధీకరించేలా మీరన్నా అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలన్నా అంటూ ఏపి ఈసీ ఏఎన్‌ఎంల యూనియన్‌ తరపున ఎ.శ్యామసుందరీ, కె.మరియమ్మ, పి.జి. సుమతి, ఎన్‌.నాగమల్లేశ్వరి పాదయాత్రలో పాల్గొన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసి సమస్య వివరించారు.

>
మరిన్ని వార్తలు