జగనన్న భరోసా.. జనం దిలాసా

19 Jun, 2018 06:57 IST|Sakshi
బోడపాటివారిపాలెంలో గ్రామస్తులకు అభివాదం చేస్తున్న జగన్‌

హుషారెత్తించిన వైఎస్‌ జగన్‌ ప్రసంగం

స్థానిక సమస్యలు ప్రస్తావించిన జననేత

పరిష్కారంపై స్పష్టమైన హామీ

పి.గన్నవరంలో మొదలైన పాదయాత్ర

సమస్యలపై వినతులు ఇచ్చిన పలువురు

సంప్రదాయ నృత్యాలతో హోరెత్తిన వశిష్ట ఏటిగట్టు గ్రామాలు

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: పి.గన్నవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి ప్రతి పక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం పి.గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలోనే తమ సమస్యలను ప్రస్తావించి, పరిష్కారంపై భరోసా ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఊడిమూడిలంక వైపున ఉన్న లంక గ్రామాలకు రాకపోకలకు అవసరమైన బ్రిడ్జిని మనందరి ప్రభుత్వం వచ్చాక నిర్మిస్తామని, రాజవరం–పొదలాడ రోడ్డు విస్తరణపై హామీ ఇవ్వడంతో సభలో చప్పట్లు మోగాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ పతనం కావడంపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కొబ్బరికి మద్దతు ధర కూడా రాకపోవడంతో దుకాణాలు మూతపడి, కార్మికులు వలసలు వెళుతున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వరికి మద్దతు ధర కూడా రావడం లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు దళారుల దోపిడీకి ఉపయోగపడుతున్నాయని ధ్వజమెత్తారు. పచ్చని కోనసీమలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నా. గ్యాస్‌పైపుల వల్ల అనుక్షణం భయంతో బతుకుతున్నారని ఇక్కడ ప్రజల మదిలోని మాటలను ప్రస్తావించారు. నగరం ఘటన తర్వాత ఇచ్చిన 18 డిమాండ్లు పరిష్కారం కాకపోవడంపై నిలదీశారు. గోదావరి పక్కనే పారుతున్నా రబీ సీజన్‌లో నియోజవకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు అందని స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఎండగట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటిగట్లను పటిష్టం చేసిన విషయం ప్రస్తావించగానే సభలో పెద్దఎత్తున ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

జననేతకు సంప్రదాయ స్వాగతం
జిల్లాలో ఆరో రోజు పాదయాత్ర పి.గన్నవరం నియోజకవర్గంలో సాగింది. ఆదివారం కొత్తపేట నుంచి పి.గన్నవరం జి.పెదపూడి గ్రామానికి పాదయాత్ర చేరుకోగా రాత్రి బస గ్రామంలో చేశారు. సోమవారం ఉదయం బస ప్రాంతం నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు పి.గన్నవరం వరకు ప్రజలు నీరాజనాలు పట్టారు. యాత్ర ప్రారంభమైన జి.పెదపూడిలో సన్నాయి వాయిద్యాలతో ఐనవిల్లి దేవాలయం పురోహితులు ఎదురేగి ఆశీర్వచనాలందించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మంతెన రవిరాజు వివిధ రకాల వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేయించారు. గిరిజనులు కొమ్ము నృత్యాలు, తప్పెటగుళ్లు, కేరళ రాష్ట్ర సంప్రదాయ వాయిద్యాలు, మహిళా తీన్‌మార్‌ వాయిద్యాలు, డప్పులతో వశిష్ట ఏటిగట్టు గ్రామాలు హోరెత్తాయి. గ్రామాల్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు రోడ్డు వెంబడి నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. వారిని పేరుపేరునా ప్రత్యేకంగా వైఎస్‌ జగన్‌ పలుకరించారు. అక్కచెల్లెమ్మలు, యువత జననేతతో సెల్ఫీలు దిగి కేరింతలు కొట్టారు. తమ గ్రామాలకు వచ్చిన జననేతను అత్యంత దగ్గరగా చూసిన జి.పెదపూడి, జె.పెదపూడి, ఉచ్చులవారిపేట, చింతావారిపేట, ఊడిమూడి, బెల్లంపూడి, తాడాలవారిపాలెం, యర్రంశెట్టివారిపాలెం, బోడపాటివారిపాలెం తూము సెంటర్, తాటికాయలవారిపాలెం పల్లెలు పరవశించాయి.

పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నేతలు
పాదయాత్రలో పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, కంబాల జోగులు, నారాయణస్వామి,  వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రా>జా, యువజన విభాగం ముఖ్యనేత జక్కంపూడి గణేష్, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పాముల రాజేశ్వరి, పొన్నాడ సతీష్‌కుమార్, తానేటి వనిత, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణ, దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, ముత్యాల శ్రీనివాస్, గుత్తుల నాగబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడ్డగల సాయిరామ్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి వెంకట శివరామన్, వాసంశెట్టి తాతాజీ, నీతిపూడి విలసిత మంగతాయారు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు మెల్లం మహాలక్ష్మి ప్రసాద్, నేతల నాగరాజు, వరసాల ప్రసాద్, రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శులు పితాని నరసింహరావు, దొమ్మేటి సాయికృష్ణ, చింతా రామకృష్ణ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులు యన్నబత్తుల ఆనంద్, పేర్ని శ్రీనివాసరావు, సేవాదళ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల కొండలరావు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకర్‌రావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, పితాని నరసింహారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మంతెన రవిరాజు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కసిరెడ్డి అంజిబాబు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు కుడిపూడి సత్తిబాబు, మట్టిపర్తి సోమేశ్వరరావు, మైలా ఆనందరావు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా సేవాదళ్‌ కార్యదర్శి నల్లమిల్లి గోవిందరెడ్డి, అమలాపురం పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మేటి శివరాం, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి మండలాల కన్వీనర్లు కొమ్ముల రామచంద్రరావు, నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి శ్రీనివాస్, సీనియర్‌ నాయకులు ఎం.ఎం.శెట్టి,  కర్రిపాపారాయుడు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉల్లి ఘన, కార్యదర్శి మట్టపర్తి యజ్ఞశ్రీ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, నేతలు ఆర్‌వీవీఎస్‌ చౌదరి, అనిల్‌రెడ్డి, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు.

అంతిమయాత్రకు దారి లేదన్నా..
పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు, నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల అక్కచెల్లెమ్మలు తమ సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. ఊడిమూడి గ్రామశివారు ఊడిమూడిలంక ప్రజలు తమకు రవాణా సౌకర్యం లేదని, వశిష్ట నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసినా 20 ఏళ్ల నుంచి పనులు చేయలేదని మొర పెట్టుకున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే పరిస్థితి లేదని అక్కచెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కల పెంపకానికి నల్లమట్టి తీసుకెళుతుంటే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని నర్సరీ రైతులు పాదయాత్రికుడి వద్ద మొర పెట్టుకున్నారు. ఆలయాల్లో ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మేలుచేయాలని నాయీ బ్రహ్మణులు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు నెలకు రూ.10 వేలు జీతం ఇస్తున్నారని, ఇక్కడ జీతం తక్కువైనా మూడునాలుగునెలలకోసారి ఇస్తున్నారని అంగన్‌వాడీలు వైఎస్‌ జగన్‌ వద్ద  వాపోయారు. వైద్య సహాయం అందించాలని పలువురు తమ అభిమాన నేతకు విన్నవించగా సహాయంపై భరోసా ఇచ్చారు. దారిపొడవునా అందరి సమస్యలు వింటూ వైఎస్‌ తనయుడు ముందుకు సాగారు. సాయంత్రం బహిరంగ సభ అనంతరం పి.గన్నవరంలోని బస ప్రాంతానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు