‘పాతపాయలో పూడిక తీయించండి’

10 Aug, 2019 08:46 IST|Sakshi

పర్యాటకుల ఇబ్బందులు నివారించండి

మంత్రి పేర్ని నాని ఆదేశం

మంగినపూడి బీచ్‌ సందర్శన

సాక్షి, మచిలీపట్నం:  మంగినపూడి బీచ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం పరిశీలించారు. బీచ్‌కు ఆనుకుని గతంలో ఉన్న సముద్రపు పాయ పూర్తిగా పూడిపోయింది. దీనికి కొంత దూరంలో మరోపాయ ఏర్పడటాన్ని మంత్రి గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్య్సకారులు వేటకు వెళ్లే బోట్లు ఈ పాయ నుంచే వెళ్లాల్సి ఉందన్నారు. పాతపాయ పూడిపోయి నూతన పాయ ఏర్పడంతో బోట్లు వేటకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

మత్య్సకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీచ్‌ పర్యాటక ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా పాత పాయలోనే పూడిక తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏర్పడిన పాయకు అడ్డంగా ఇసుక బస్తాలను ఉంచి పాత పాయను తవ్వాలని సూచించారు. ఈ పర్యటనలో పేర్ని నాని వెంట వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు లంకే వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ వాలిశెట్టి రవిశంకర్, కేడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌లు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, మెప్మా పీడీ జి.వి.సూర్యనారాయణ, తహాసీల్దార్‌ డి.సునీల్‌బాబు, ఎంఆర్‌ఐ యాకూబ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు