మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపారు’

21 Nov, 2019 12:43 IST|Sakshi

సాక్షి, ముమ్మిడివరం: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 80 శాతం హామీలను అమలు చేశారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సుభాష్‌ చంద్రబోస్‌ మట్లాడుతూ.. ఇచ్చిన హామీని అమలు చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి సీఎం జగన్‌ అని ప్రశంసించారు. సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునన్నారని గుర్తు చేశారు.

మత్స్యకార కుటుంబ్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే మత్స్యకార కుంటుంబాలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకున్నారని సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీఎం జగన్‌ ప్రవేశ పెట్టిన పథకంతో మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చినట్టుగానే మిగతా మత్స్యకారులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారని కోరారు. జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకం తమకుందని ఎమ్మెల్యే సతీష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు