పోలీసుల ఓవరాక్షన్‌

18 Mar, 2019 11:51 IST|Sakshi
పోలీసుల దురుసు ప్రవర్తనపై ఏఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

జగన్‌ సభకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై  చేయి చేసుకున్న పోలీసులు

జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్‌ఐ ధర్మరావు

ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేసిన

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

విశాఖపట్నం  ,నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నంలో ఆదివా రం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సభకు తరలివచ్చిన కార్యకర్తలపై  పోలీసులు దురుసుగా ప్రవరించారు. కొందరిపై చేయి చేసుకున్నారు. నర్సీపట్నంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెదడడ్డేపల్లి జంక్షన్, జోగినా«థునిపాలెం జంక్షన్, హెలిప్యాడ్‌కు వెళ్లె రోడ్డులో  పలు చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఉహించని విధంగా జనాలు తాకిడి పెరగడంతో కొందరు పోలీసులు   కార్యకర్తల వా హనాలను  తమ ఇష్టమెచ్చినట్లుగా నిలుపుదల చేయడంతో పాటు వారిపై దురుసుగా ప్రవర్తించారు.

తుని రూటులో  వచ్చే వారి పట్ల  ఏఎస్‌ఐ ధర్మరావు  మరీ ధారుణంగా  వ్యవహరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ  వార్త సేకరణ కోసం వచ్చిన రాష్ట్ర,జిల్లా జర్నలిస్టుల ప్రత్యేక వాహనాన్ని  నిలుపుదల చేశారు. కవరేజీ కోసం వచ్చామని  మీటింగ్‌ అయిపోతోంది, వాహనాన్ని వెళ్లనీయండని ఏఎస్‌ఐ ధర్మరావుకు విజ్ఙప్తి చేసినా కనీసం పట్టించుకోకుండా, వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు.  చివరకు ఎస్పీ కార్యాలయం నుంచి  పీఆర్‌వో శ్రీనివాసరావు స్వయంగా పోన్‌ చేసి, అవాహనాన్ని విడిచి పెట్టాలని ఏఎస్‌ఐ ధర్మరావుకు చెప్పినా  మొండిగా వ్యవహరించారు. అక్కడకు సమీ పంలో ఉన్న  ఎస్‌ఐ వచ్చి... వాహనాన్ని పంపిం చారు. నాయుకులు, కార్యకర్తలపై దురుసుగా  వ్యవరించిన కొందరు పోలీసులు తీరుపై  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఏఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌కు  స్వయంగా పిర్యాదు చేశారు. కార్యకర్తలను దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా సిబ్బందికి ఆదేశిస్తామని ఏఎస్పీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు