పోలీస్ రెడీ

29 Jan, 2014 02:44 IST|Sakshi

 కామారెడ్డి, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు తమ పరిధిలోని సర్కిళ్లు, పోలీసుస్టేషన్లవారీగా శాంతిభద్రతల పరిస్థితులపై నివేదికలను రూపొందించారు. గతంలో జిల్లా లో నక్సల్స్ కార్యకలాపాలు జోరుగా సాగిన పరిస్థితులు, ఇప్పుడు నక్సల్స్ కదలికలు లేకుండా పోయిన నేపథ్యం వంటి అంశాలపై అధికారుల అభిప్రాయాలను సేకరించి ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలు, రౌడీషీటర్లు, ఇతర అసాం ఘిక శక్తుల గురించి ఇప్పటికే నివేదికను రూపొందించుకున్నట్టు  తెలుస్తోంది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు 2010లో జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నిక, 2011లో జరిగిన కామా రెడ్డి ఉప ఎన్నికలలోని అనుభవాలను కూడా పోలీసు అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా అధికారులతో ఎస్‌పీ  ప్రతీ అంశాన్ని చర్చించారు.

 గతంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఘటనలకు అవకాశం ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

 బదిలీలతో వే గం పెంచి
 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎస్‌ఐల బదిలీలతో పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇటీవల రెండు విడతలుగా ఎస్‌ఐలను బది లీలు చేశారు. కొత్తవారికి పోస్టింగులు ఇవ్వాల్సి ఉం డడంతో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 70 మందికి పైగా ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారిని వీఆర్‌కు, చురుకుగా లేనివారిని లూప్‌లైన్‌కు బదిలీ చేశారు. యువ అధికారులకు పోస్టింగులు ఇచ్చారు. ప్రతిసారి బదిలీ వ్యవహారంలో రాజకీయ నేతల ముద్ర కనిపించేంది. ఈ సారి మాత్రం రాజకీయ నేతలకు సంబంధం లేకుండానే బదిలీలు జరిగాయంటున్నారు.

 గొడవలపైనే దృష్టి
 ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు, నేతల మధ్య ఆధిపత్యపోరు ఎక్కువైన నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశాలున్నందున వాటిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారిం చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నోటిఫికేషన్ రాకముందు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజాప్రతిని ధులు, నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తి గొడవలు చెల రేగా అవకాశాలున్న ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పుడే గొడవలు మొదలైతే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశమున్నం దున, గొడవలకు ఎవరు కారణమైనా ఉపేక్షించొద్దని ఎస్‌పీ పోలీసు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఏది ఏమైనా ఓట్ల పండుగకు పోలీసు యం త్రాంగం ముందస్తుగానే సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు అధి కారులు కసరత్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు