పదో రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

16 Nov, 2017 09:13 IST|Sakshi

సాక్షి, కర్నూలు‌ : ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పదో రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. కాగా, తొమ్మిదవ రోజు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 14.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు ఆయన 124.3 కిలోమీటర్లు పాదయాత్ర  చేశారు.

మరిన్ని వార్తలు