స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి..

23 Dec, 2013 03:11 IST|Sakshi

పాల్వంచ, న్యూస్‌లైన్: కాలుష్య ప్రభావిత గ్రామాల్లోని యువకులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచాలని, సీఎస్‌ఆర్ పాలసీని అమలుచేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక యువకులు ఆదివారం నవభారత్ వెంచర్స్, ఎనర్జీ ఇండి యా సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహా ర దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎండి.అక్బర్, రాంబాబులు మా ట్లాడుతూ నవభారత్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యం వల్ల సమీపంలోని పాత పాల్వంచ, సంజయ్ నగర్, గాంధీనగర్, కేసీఆర్‌నగర్, రాజీవ్‌నగర్, సాయినగర్, శేఖరంబంజర, పాలకోయ తండా తదితర గ్రామాల ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని అన్నారు.
 
  యాజ మాన్యం సీఎస్‌ఆర్ పాలసీని అమలు చేసి ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికం గా ఉన్న నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో ఆనంద్, సాయి, వీరన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. వారికి బీసీ సంఘం నాయకులు రేగళ్ల శ్రీను, టీఎన్‌టీయుసీ నాయకులు గొర్రె వేణుగోపాల్, ఎల్‌హెచ్‌సీఎస్ నాయకులు మాలోతు కోటి, కాంగ్రెస్ నాయకులు ఎస్‌వీఆర్‌కే ఆచార్యులు ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు.
 

మరిన్ని వార్తలు