Israel-Hamas War: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్

7 Nov, 2023 10:54 IST|Sakshi

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం వల్ల అక్కడ 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' తాజా నివేదికలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యుద్ధం వల్ల ఉద్యోగం కోల్పోయిన వారిలో చాలామంది ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నట్లు సమాచారం, ఇది ఇలాగే కొనసాగితే పాలస్తీనాలో పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ రుబా జరాదత్ వెల్లడించారు.

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడి తరువాత పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. పాలస్తీనాలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగుల సంఖ్య మొత్తం 1,82,000. ఇప్పటికే కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయం కల్పించగా, మరికొన్ని మాకాం మార్చాడనే సిద్దమైపోయాయి.

ఈ వివాదం వెస్ట్ బ్యాంక్‌లో స్పిల్‌ఓవర్ మీద కూడా ప్రభావాన్ని చూపింది. దీంతో ఇందులో సుమారు 24 శాతం లేదా 2,08,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం మీద యుద్ధ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయినవారు 3,90,000 మంది ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రపంచ చరిత్రలో సరికొత్త మైలురాయి.. అదరగొట్టిన జపాన్ కంపెనీ!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టలేదు. దీంతో అక్కడి ప్రజలు ఇంధనం, ఆహారం, విద్యుత్ వంటి నిత్యావసర వస్తువులను కూడా పొందలేకపోతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు