నేటి నుంచి బెంగళూరుకు విమానం

1 Jul, 2020 10:20 IST|Sakshi

మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులు నిర్వహించనుంది. 6ఈ7231 నెంబర్‌ గల ఈ సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.35 గంటలకు బెంగళూరులో బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. 6ఈ7232 నెంబర్‌ గల సర్వీసు సాయంత్రం 6.00 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు పయనమవుతుంది. ఉదయం 9.25 గంటలకు, రాత్రి 9.15 గంటలకు ఉన్న హైదరాబాద్‌ సర్వీసులు యథాతథంగానే కొనసాగుతాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ ఆగస్టు 20వ తేదీ వరకూ ఇదేవిధంగా కొనసాగుతాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా