చల్లగ ఉన్నడనుకున్నం

3 Mar, 2016 01:46 IST|Sakshi
చల్లగ ఉన్నడనుకున్నం

ఇప్పుడిలా దూరమయ్యిండు
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రమేష్
మాతృమూర్తుల ఆవేదన
మృతి వార్త విని ఉలిక్కిపడిన అందుకూరు

 ‘వాడు అన్నింటిలో పొష్టే, వాడు చాలా తెలివైనోడు, యూడికిపోయూడో..ఎటు పోయూడో తెలియదు.. 20 ఏళ్ల తర్వాత పోలీసోళ్లొచ్చి.. చచ్చిపోయూడని చెబితే గుండె పగిలిపోరుుంది..వాడెక్కడున్నా చల్లగ ఉంటడనుకున్నం..ఇప్పుడిలా దూరమైపోయుండ‘య్యూ అంటూ గొట్టిముక్కల రమేష్(48) కన్నతల్లి, పెంచిన తల్లి ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..కొడుకు మిగిల్చిన జ్ఞాపకాలను
 తలుచుకుంటూ ఘెుల్లుమన్నారు.

     
క్రోసూరు:  ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో మంగళవారం వేకువజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గొట్టిముక్కల రమేష్ స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు. రమేష్ కన్నతల్లి అనసూర్యమ్మ, తండ్రి వీరబ్రహ్మాచారి. వీరి ఐదురుగు సంతానంలో రమేష్ చివరి వాడు. అనసూర్యమ్మ అక్క గొట్టిముక్కల మాణిక్యమ్మ, జానకిమయ్యలకు సంతానం లేకపోవడంతో రమేష్‌ను పెంచుకున్నారు. ఇతను అందుకూరులోనే ఉంటూ క్రోసూరు జెడ్పీ పాఠశాల్లో పది, అమరావతిలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివేందుకు హైదరాబాద్‌లోని ఆచార్య రంగా యూనివర్సిటీలో చేరాడు. రెండేళ్లు చదివాక..అందుకూరుకు చెందిన ఒక వ్యక్తి తన పిల్లలకు ట్యూషన్లు చెప్పాలని గుంటూరు తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి ఇంటికి రావడం మానేశాడు. ఎక్కడున్నాడో కూడా తల్లిదండ్రులకు ఆచూకీ తెలియలేదు. అప్పటి నుంచి బిడ్డ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. అనసూయమ్మ, మాణిక్యమ్మల భర్తలు చనిపోవడంతో ఇద్దరూ ఒకే ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నారు..ఇప్పుడు బిడ్డ కడసారి చూపు కోసం.. రోదన నిండిన గుండెలతో..ఆశలు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు ఈ మాతృమూర్తులు.

మరిన్ని వార్తలు