రెయిన్‌బో చిల్డ్రన్స్‌ లాభం రూ. 63 కోట్లు

31 Oct, 2023 05:55 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ (ఆర్‌సీఎంఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్‌ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్‌ సీఎండీ రమేష్‌ కంచర్ల తెలిపారు.

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో  మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది.

మరిన్ని వార్తలు