నవరత్నాలతో రాజన్న రాజ్యం

21 Sep, 2018 10:41 IST|Sakshi
కంగుదిలో నవరత్నాల పథకాలను వివరిస్తున్న కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి

చిత్తూరు, సాక్షి: నవరత్నాలతో రాజన్న రాజ్యం వస్తుందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలో తిరుపతి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహాస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. నాయకులు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రతి తలుపునూ తట్టి నవరత్నాలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.

తిరుపతి 10వ వార్డులోని కొర్లగుంటలో వైఎ స్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పర్యటించారు. నవరత్నాలను ప్రజలకు వివరించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో మళ్లీ రాజన్న పాలనను పొందవచ్చన్నారు.  
నవరత్నాలతో పేదరికం దూరమవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లి, కందూరు, తమ్మినాయునిపల్లి పంచాయతీల్లో జరిగిన రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు విన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయని చెప్పారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మె ల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. ఎస్సార్‌పురం మండలం ముదికుప్పం పంచాయతీలో గడపగడపకూ తిరుగుతూ నవరత్నాలను ప్రజ లకు వివరించారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్, అమ్మ ఒడి పథకాలతో పేద పిల్ల లు పెద్ద చదువులు చదువుకునే అవకాశం ఉందన్నారు.
కుప్పం నియోజకవర్గం కంగుందిలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల సమస్యలు విన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయింస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా నీటితో కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
శ్రీకాళహాస్తిలో గురువారం రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ నవరత్నాలను వివరించారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు రాజన్న రాజ్యంలో మేలు జరిగిందన్నారు. రిటైర్డ్‌ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్‌ బాలశౌరి వైఎస్సార్‌సీపీలో చేరారు.
చిత్తూరులోని మురకంబట్టులో జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. మురకంబట్టులో ప్రతి ఇంటికీ నవరత్నాల్లోని పథకాల వివరాలు ముద్రించిన కరపత్రాలను పంచారు. స్థానిక  సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సత్యవేడు బుచ్చినాయుడు కండ్రిగ కాటూరులో గురువారం రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. ఆదిమూలం పాల్గొన్నారు. ప్రజా సమస్యలు విన్నారు.
పలమనేరు నియోజకవర్గ ఇంచార్జి వెంకటే గౌడ పెద్దపంజాణిలో నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు. పరిష్కరించేందకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలను వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా