3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన

25 May, 2018 00:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా జూన్‌ 3న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సింహగర్జన పోస్టర్లను ఆయ న విడుదల చేశారు. తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహించే సభకు దేశంలోని రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

దేశ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గంలో 3 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో అధిక శాతం పేదరికంతో బాధపడుతున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో రూ.1,000 కోట్లు, జాతీయ స్థాయిలో రూ.10 వేల కోట్లతో జాతీయ రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేజర్‌ జనరల్‌ సిన్హా కమిటీ రెడ్డి సామాజిక వర్గంలో అధిక శాతం వెనకబడి ఉన్నారని, వీరిని ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కమిటీ నివేదికను పార్లమెంట్‌లో చర్చించి ఆమోదించాలన్నారు. కార్యక్రమంలో బసిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి, విరాణిరెడ్డి, రవీందర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, సూర్యకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు