రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం 7,376 కోట్లు

26 May, 2014 03:22 IST|Sakshi
రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం 7,376 కోట్లు

గత ఏడాది కంటే 68 శాతం అధికంగా లక్ష్యం
ఆదాయం పెరగడం అసాధ్యమంటున్న అధికారులు
లక్ష్యాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వానికి లేఖ

 
హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,376 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ద్వారా రూ.4,383.84 కోట్ల రాబడి వచ్చింది. దీనికంటే 68 శాతం అధిక ఆదాయం సాధించాలని ప్రభుత్వం తాజాగా ఆ శాఖ కమిషనర్‌కు సర్క్యు లర్ పంపింది. అరుుతే రూ.7,376 కోట్ల ఆదాయం మాట అటుంచితే గత ఏడాది మేరకు లేదా ఆపై రాబడి సాధించడం కూడా అసాధ్యమని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అధికారులతో ఈ విషయమై చర్చించిన కమిషనర్ విజయకుమార్ వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని.. ఇంత రాబడి సాధ్యం కాదని, లక్ష్యాన్ని కుదించాలని పేర్కొం టూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

అరుుతే రాష్ట్రం వచ్చేనెల 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోతున్నందున కొత్త ప్రభుత్వాలు సమీక్షించి తాజాగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘ కొత్త ప్రభుత్వాలు ఆదాయ లక్ష్యాలను నిర్ణయించిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు జిల్లాల వారీ రాబడి లక్ష్యాలను ఖరారు చేసి జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారు. వారు ఈ మేరకు ఆదాయ సాధనకు కృషి చేస్తారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత వాస్తవ విలువలకు అనుగుణంగా భూములు, స్థలాల మార్కెట్ విలువలను కూడా పునస్సమీక్షించే అవకాశం ఉంది’ అని రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
 

మరిన్ని వార్తలు