నామినేషన్ల పరిశీలన పూర్తి

27 Mar, 2019 13:27 IST|Sakshi

అసెంబ్లీకి 28 నామినేషన్ల తిరస్కరణ

నెల్లూరు పార్లమెంట్‌కు 7, తిరుపతి పార్లమెంట్‌కు 5

సాక్షి, నెల్లూరు(పొగతోట): నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, ఆర్‌ఓ ఆర్‌ ముత్యాలరాజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. 21 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. నామినేషన్‌ పత్రాలపై పూర్తి స్థాయిలో సంతకాలు చేయకపోవడం, అఫిడవిట్స్‌ అందజేయకపోవడం తదితర కారణాలతో నామినేషన్లను తిరస్కరించారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి జాయింట్‌ కలెక్టర్, ఆర్‌ఓ  వెట్రిసెల్వి నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఐదుగురు  అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు 
కావలి నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఆత్మకూరుకు సంబంధించి 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్క నామినేషన్‌ను మాత్రమే తిరస్కరించారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఒక్కరి నామినేషన్‌ను మాత్రమే తిరస్కరించారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు నామినేషన్లను తిరస్కరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందరి నామినేషన్లు ఆమోదించారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నలుగురి నామినేషన్లను తిరస్కరించారు.

28 వరకు నామినేషన్ల ఉపసంహరణ  
ఈ నెల 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పోటీలో ఉండే అభ్యర్థులతో బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేస్తారు.  

మరిన్ని వార్తలు