రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి

27 Nov, 2019 20:13 IST|Sakshi
బాబూరావుపై దాడి చేస్తున్న పవన్‌

సాక్షి, నూజివీడు: కృష్ణా జిల్లా ముసునూరులో రెవెన్యూ ఉద్యోగి ఒకరు రెచ్చిపోయాడు. దరఖాస్తుదారుడిపై విచక్షణారహింగా దాడి చేశాడు. మద్దాల బాబురావు అనే వ్యక్తి బుధవారం ముసునూరు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. కులధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల నుంచి తిప్పించుకుంటున్నారని అతడు వాపోయాడు. లంచం ఇవ్వకపోతే పని చేయరా అంటూ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్‌ను నిలదీశాడు. కోపంతో ఊగిపోయిన పవన్‌ కార్యాలయం నుంచి బయటకు వచ్చి బాబూరావుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

తనను రక్తమోచ్చేలా కొట్టిన పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాబూరావు ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబూరావు తనను దూషించాడని పవన్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్‌ దాడిలో బాబూరావు కంటికి గాయమైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు