కిడ్నీ మరణాలు కలిచివేశాయి

23 Mar, 2019 10:04 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ తరఫున పలాస ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పలరాజు

సాక్షి, కాశీబుగ్గ: చేతినిండా సంపాదన, వైద్యునిగా రోగుల్లో మంచి గుర్తిం పు.. కానీ ఇవేవీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. సొంత ప్రాంతంలో  ఏళ్ల తరబడి ఏడుపులు వినిపిస్తుంటే ఇ సుమంతైనా పట్టించుకోని నాయకుల తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆ రోదనలే తనను రాజకీయాల వైపు నడిపించాయని ఆయన చెబుతున్నారు వైఎస్సార్‌సీపీ తరఫున పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీదిరి అప్పలరాజు ‘సాక్షి’తో ఇలా మాట్లాడారు.

సాక్షి : వైద్యునిగా పేరు సంపాదించారు. మరి రాజకీయాలకు ఎందుకొచ్చారు?
సీదిరి : వాస్తవానికి రాజకీయాలే నన్ను తీసుకువచ్చాయని చెప్పాలి. నేను ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎండి జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి కేజిహెచ్‌లో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు అక్కడకు వచ్చేవారు. ఇంత మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించేది. వారి ఏడుపులే నన్ను రాజకీయాల వైపు వెళ్లేలా చేశాయి. వారికేదైనా సేవ చేయాలనే ఇటువైపు అడుగులు వేశాను.


సాక్షి : వైఎస్సార్‌సీపీలోనే చేరడానికి కారణం? 
సీదిరి: పూటకోమాట చెప్పే చంద్రబాబు వంటి నాయకుడిని నమ్మలేను. వైఎ స్సార్‌ కొడుకై ఉండి కూడా సొంతంగా గుర్తింపు తెచ్చుకుని, జనం కోసం కష్టపడుతున్న జగన్‌ తీరు నాకు నచ్చింది. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాను. 


సాక్షి : పలాసకు ఏమేం అవసరమనుంటున్నారు? 
సీదిరి: కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్‌ సెం టర్, ఆఫ్‌షోర్‌ పూర్తి చేసి నీరి వ్వడం, పలాస –కాశీబుగ్గ జంట పట్టణాలకు డిగ్రీ కళాశాల, అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌ పూర్తి చేయడం, మినీ స్టేడియం, రైతు బజారు, మత్స్యకారులకు జెట్టీలు నిర్మించడం, గిరిజనులను ఐటీడీఏలో చేర్చ డం, అర్హులైన తిత్లీ బాధితులకు పరి హారం, రోడ్ల విస్తరణ, 200 పడకల ఆస్పత్రి, బ్లడ్‌బ్యాంక్, జీడి కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయడం, వ్యాపారులకు మరో ఇండస్ట్రియల్‌ ప్రాంతం, పలాస రైల్వేస్టేషన్‌ను విశాఖ జోన్‌లో కలపడం నేను అనుకుంటున్న పనుల్లో ముఖ్యమైనవి. ము ప్పై ఏళ్లుగా ఇవన్నీ కలగానే మిగిలిపోయాయి. ఇంకా గ్రామా ల వారీ ప్రణాళికలు కూడా ఉన్నాయి.  


సాక్షి : ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
సీదిరి: నేను చేపల వేట చేసుకుని బతికే ఓ సామాన్య కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదివి డాక్టరయ్యాను. వృత్తితో బాగానే ఉన్నా ను. కానీ నా ప్రజల సమస్యలు కళ్లారా చూశా ను. వారి కోసమే కొండను ఢీకొట్టబోతున్నా ను. రెండేళ్లుగా ప్రజా పోరాటాలు చేశాను. జనాలందరికీ దగ్గరయ్యాను. వారి ప్రేమతో అసెంబ్లీకి వెళ్తే నా ప్రాంత ప్రజల గొంతుకనవుతాను.  

మరిన్ని వార్తలు