మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

7 Oct, 2019 09:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు...ఈ రోజు (సోమవారం) మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ జగన్మాత దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించింనందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు వచ్చింది. తొమ్మిదిరోజులపాటు సాగిన రణంలో రోజుకో రూపంతో అమ్మవారు యుద్ధం చేశారు. సింహ వాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో తల్లి దర్శనమిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి దుర్గామాత పటాన్ని బహుకరించారు.

మరిన్ని వార్తలు