రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలి

30 Nov, 2018 14:35 IST|Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం సీమ జిల్లాలో రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేయకుండా పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం సరికాదని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయలసీమ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రం కడపలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో   ఆయన మాట్లాడారు.  ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ప్రాజెక్టుల పురోగతికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. నేడు కోస్తా ప్రాంతానికి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటిని అందిస్తుండంతో దాదాపు 25 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతోందని తెలిపారు. రాయలసీమలో లక్ష ఎకకరాలకు నీటిని అందించే ప్రాజెక్టు లేకపోవడం బాధాకరమన్నారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక ఈ ఏడాది దాదాపు 240 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి, ఆర్సీపీ నాయకులు శేఖర్, లింగమూర్తి, మగ్బూల్‌ భాష,  విద్యార్దులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు