రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సూచనలు

26 Jul, 2014 16:52 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాజధాని ఎంపికపై కీలక సూచనలు, సలహాలు అందజేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించింది.

రాయలసీమలో కరువు ఎక్కువగా ఉందని, దీనికి తోడు నీటి సమస్య కూడా ఉందని శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. రాయలసీమలో అన్ని ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉండకపోవచ్చని పేర్కొంది. కృష్ణా-గుంటూరు మధ్య రాజధానిని నిర్మించడం అనువుగా ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ ప్రాంతంలో నీటిసమస్య కొత వరకు ఉందని, భూసేకరణ కూడా కష్టమని వెల్లడించింది. జాతీయ స్థాయి వైద్య సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్న చోట పెట్టాలని సూచించింది.

మరిన్ని వార్తలు