ఒకరికి ఒకరై తోడుంటే!

30 Apr, 2020 16:19 IST|Sakshi

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో  దేశ వ్యాప్తంగా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజు పనిచేస్తే కాని పూటగడవని ఎంతో మంది రోజులు తరబడి పస్తులు ఉండే పరిస్థితి దాపురించింది. ఇలాంటి సమయంలో వారిని ఆదుకొని అన్నం పెట్టే ఆపన్న హస్తాల కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలను, నిరాశ్రయులను, ఉపాధి కోల్పొయి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవడానికి అనేక స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్మ్యాన్)

జగిత్యాలలో తల్లిదండ్రులను కోల్పొయిన ఇద్దరి పిల్లల్ని అంగన్వాడీ టీచర్‌ అక్కున చేర్చుకుంది.ఈ విషయం పేపర్‌ ద్వారా తెలుసుకున్న ఫ్రెండ్స్‌ బీయింగ్‌ ఎ హెల్పింగ్‌ హ్యాడ్స్‌ అనే ఎన్‌జీఓ సంస్థ వారిక బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఎన్‌జీఓ ప్రతినిధి మోర భాను ప్రభా దగ్గరుండి సాయం చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం వారికి చదువు చెప్పిస్తామని ఎన్‌జీఓ ఫౌండర్‌, సీఈఓ వికిల్‌ ప్రభ చెప్పారు

 

ప్రకాశం జిల్లా జల్లెపాలెం గ్రామంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి అనపు రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. 400 బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు బియ్యాన్ని ఉచితంగా అందించారు.  

కర్మాన్‌ఘూట్‌లో ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న విజేందర్‌, తన స్నేహితులతో కలిసి గ్రీన్‌ పార్క్‌ కాలనీలో ఆకలితో బాధపడుతున్న వారికి 100 కిలోల బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, ఆయిల్‌ అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.  (సేవ సైనికులు)

మీరు ​కూడా ఈ లాక్‌డౌన్‌ కాలంలో మీరు చేస్తున్న సాయాన్ని నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలంటే webeditor@sakshi.comకి మీ వివరాలు పంపించండి. 


 

మరిన్ని వార్తలు