ఏకాభిప్రాయం ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం:ఉండవల్లి

10 Jul, 2013 20:15 IST|Sakshi
ఉండవల్లి అరుణ్ కుమార్

రాజమండ్రి: ఏకాభిప్రాయం ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాద్యమవుతుందని ఎంపి ఉండవల్ల అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రాల డిమాండ్ ఊపందుకుంటుందని చెప్పారు. పలు రాష్ట్రాలలో ఏర్పాటువాడ డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనన్నారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  తిట్లదండకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తిట్ల దండకానికి తెలంగాణ ఇస్తే ప్రజలకు అన్యాయం చేసినట్లేనన్నారు. తిట్లు దబాయించి తెలంగాణ తెచ్చుకోవాలని చూస్తే అందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. కెసిఆర్ తప్పుడు లెక్కలు విని అమాయకులైన యువకులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన డిమాండ్లతో ప్రజాస్వామ్యబద్దంగా తెలంగాణ సాధించుకుంటే తమకు ఏమీ అభ్యంతరంలేదన్నారు. తెలంగాణవాదుల ఆరోపణలపై ఉమ్మడివేదికపై చర్చకు సిద్ధం అని పిలుపు ఇచ్చారు. పన్నుల లెక్కలపై గణాంకాలతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ వాస్తవాలను తెలియనివ్వడంలేదన్నారు. కెసిఆర్ అలా మాట్లాడటం ప్రాంతీయ ద్రోహమే కాకుండా, దేశద్రోహం అన్నారు.

ప్రాంతీయపార్టీలకు ఓట్లు వేస్తే అల్లకల్లోలమే అవుతుందన్నారు. పార్లమెంటులో ఎస్పి నేతల తీరే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. బడుగుల హక్కులను జాతీయపార్టీలే కాపాడగలవన్నారు.

మరిన్ని వార్తలు