శ్రీవారి కల్యాణాలపై ప్రత్యేక నిఘా

10 Nov, 2013 03:29 IST|Sakshi

తిరుపతి, న్యూస్‌లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై టీటీడీ స్పందించిం ది. కల్యాణోత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ కల్యాణోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్క ర్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కల్యాణోత్సవం ప్రాజె క్టు, కల్యాణాల నిర్వహణపై జేఈవో అధ్యక్షతన శనివా రం శ్వేత భవనంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. కల్యాణోత్సవాల నిర్వహణకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించా రు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఆయా సంస్థలపై పరిశీలన, వేదిక ఖరారు, నిర్వహణ, కల్యాణోత్సవ అనంతరం ఖర్చు తదితర అంశాలపై పర్యవేక్షిం చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమి టీ సూచన మేరకే కల్యాణోత్సవాన్ని ఖ రారు చేస్తారు. డొనేషన్ ఎవరి నుంచి తీసుకోవాలి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అలాంటివాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణరుుంచారు. డొనేషన్ తీసుకునే వారి వివరాలు పూర్తిగా సేకరించి ఏడాది కాలానికి ప్రత్యేక కేలండర్‌ను రూపొందిస్తారు. దీనికి అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ కల్యాణోత్సవం నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. అదేవిధంగా కల్యాణోత్సవం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాల్లో భక్తులు సమర్పించే ప్రతి కానుక టీటీడీ కి అప్పగించాల్సిందేనని అధికారులు సూచించారు.

శ్రీనివాస కల్యాణం, గోవింద కల్యాణాలు వేర్వేరుగా కాకుండా ఒక పేరుతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ నిర్వహణ కేవలం ప్రత్యేక అధికారి కాకుండా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిందేనని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో అందజేస్తారు. అనంతరం ఈవో నిర్ణయం మేరకు కల్యాణోత్సవాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు అధికారులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు