రాజమండ్రిలో 48 గంటల బంద్

28 Aug, 2013 10:30 IST|Sakshi

హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులపై దాడిని రాజమండ్రిలోని విద్యార్థి ఐకాస తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా బుధవారం నుంచి రెండు రోజులపాటు రాజమండ్రి నగరంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. దాంతో బుధవారం రాజమండ్రి నగరంలో జనజీవనం స్తంభించింది. 

ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా సంస్థలను యాజమాన్యం స్వచ్ఛందంగా ముసివేశాయి. వ్యాపార సంస్థలు కూడ మూసివేశారు. అలాగే బంద్ సంపూర్ణంగా కొనసాగించేందుకు విద్యార్థి ఐకాస ఇప్పటికే నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఐకాసల మద్దతును కూడగట్టింది. దీంతో రాజమండ్రిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది.
 

 

మరిన్ని వార్తలు