67.41కి చేరుకున్న రూపాయి | Sakshi
Sakshi News home page

67.41కి చేరుకున్న రూపాయి

Published Wed, Aug 28 2013 10:11 AM

67.41కి చేరుకున్న రూపాయి - Sakshi

ముంబయి : రూపాయి మరోసారి ఢమాల్ మంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం రూపాయి చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. నిన్న రెండు రూపాయల దాకా పతనం కాగా ఈరోజు రూపాయి 67.41 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వారంలో రూపాయి ఆరు శాతం వరకూ పతనం అయ్యింది. జూలైలో 15 నుంచి 11 శాతం, జవవరి 1 నుంచి 18 శాతం డౌన్ అయ్యింది.

మరోవైపు ఈ ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 70 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఒక్క తైవాన్‌ సూచీ మాత్రమే స్వల్పంగా లాభాల్లో ఉంది. సింగపూర్‌ నిఫ్టీ 70 పాయింట్లకు పైగా నష్టపోతూ 5,240కి సమీపంలో ట్రేడవుతోంది. ఇక స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఈవాళ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా, యూరోప్‌ మార్కెట్లు 2 శాతం దాకా నష్టపోయాయి. ఇక బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement