టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం 

30 Apr, 2018 12:27 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పదవి ద్వారా సామాన్య ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా