ఏసీబీకి చిక్కిన సర్వేయర్

9 Sep, 2015 19:02 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన సర్వేయర్

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. రాపాక గ్రామానికి చెందిన చేపల అప్పలనాయుడు తన భూమి సర్వే కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. సర్వేయర్ రాజశేఖర్ సర్వే చేసినప్పటికీ నివేదిక ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో అప్పల నాయుడు నుంచి సర్వేయర్ రాజశేఖర్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ ప్రైవేటు సహాయకుడు శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు