కార్పొరేషన్‌లో టీడీపీ మార్కు రాజకీయం

17 May, 2016 08:19 IST|Sakshi
కార్పొరేషన్‌లో టీడీపీ మార్కు రాజకీయం

స్టాడింగ్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కని చోటు
ముఖ్యనేతల అనుచరులకే పెద్దపీట

 
నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు తమదైన మార్కు రాజకీయం చేశారు. నామినేషన్ల పర్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై చిన్నచూపు చూపి ముఖ్యనేతల అనుచరులకే పెద్దపీట వేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా,  టీడీపీ నుంచి ఏకంగా 13మంది కార్పొరేటర్లు ఎవరికి వారుగా నామినేషన్లు వేశారు. దీంతో సోమవారం నగర మేయర్ అజీజ్ ఎవ రికి స్టాండింగ్ కమిటీలో చోటు ఇవ్వాలని మల్లగుల్లాలు పడ్డారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్రతో చర్చించి ఐదుగురి పేర్లను ఖరారు చేశారు. దీంతో మిగిలిన 8 మంది  చివరి నిమిషంలో నామినేషన్‌లు ఉపసంహరిం చుకోక తప్పలేదు. ఆనం వర్గానికి చెందిన కిన్నెర ప్రసాద్, జెడ్‌ఎస్ వర్గానికి చెందిన రాజేష్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గానికి చెందిన దొడ్డపనేని రాజానా యుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గానికి చెందిన  జానకి, మేయర్ వర్గానికి చెందిన షేక్ వహిదకు అవకాశం కల్పించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కని చోటు
 తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికి స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. పార్టీలోని ముఖ్యనేతల అనుచరులకే అవకాశం కల్పించారు.

>
మరిన్ని వార్తలు