చంద్రబాబు అసలు కుట్ర అదే: మంత్రి కాకాణి

7 Dec, 2023 19:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: అధికారులందరూ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించగలిగారని, సీఎం జగన్‌ ఆదేశాలతో ఎక్కడికక్కడ అధికారులు వేగంగా స్పందించారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలవి శవ రాజకీయాలంటూ మండిపడ్డారు.

‘‘శవాలపై చిల్లర ఏరుకునేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. కష్టకాలంలో రైతులను రెచ్చగొట్టాలనేదే చంద్రబాబు లక్ష్యం. ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పని. రైతులు నష్టపోవాలనేదే చంద్రబాబు అసలు కుట్ర. రైతులు సంతోషంగా ఉండాలనేది సీఎం జగన్‌ ఆకాంక్ష. పంట బీమా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏం లేదు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.

వైఎస్సార్‌ పంట బీమా అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం మాత్రమే. రైతుల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతులకు సీఎం జగన్‌ గత నాలుగున్నరేళ్లుగా ఎంతో మేలు చేశారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తోంది. రామోజీ రోత రాతలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. పంటలకు సంబంధించి పూర్తి వివరాలు కేంద్రానికి పంపాం. ఈ నెల 8 నుంచి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరిస్తారు. 10 లోగా పూర్తి సమాచారం వస్తుంది. పంట నష్టంపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తాం. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేసేలా ఎల్లో మీడియా రాతలు ఉన్నాయి  రైతులకీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా వుంది.. రైతులు గందరగోళానికి గురి కావొద్దు’ అని మంత్రి కాకాణి సూచించారు.
చదవండి: లోకేష్‌ పాదయాత్రకు మంగళం 

>
మరిన్ని వార్తలు