రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

7 Dec, 2023 21:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ  చేసింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్‌గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్‌ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు.. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు

  • బెయిల్‌ కండిషన్లు అన్నీ యథాతధం
  • స్కిల్‌ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు
  • కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు
  • కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్
  • హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు
  • ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి
  • తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ

ఇదీ చదవండి: లోకేష్‌ పాదయాత్రకు మంగళం

>
మరిన్ని వార్తలు