గిరిజనులను దోచుకుంటున్నారన్నా

2 Aug, 2018 07:40 IST|Sakshi
జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన విలీన మండలాల ‘పోలవరం’ నిర్వాసితులు

తూర్పుగోదావరి: ప్యాకేజీ సక్రమంగా అమలు చేయకుండా ముంపు గ్రామాల ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో బాగంగా గొల్లప్రోలు వచ్చిన జగన్‌ను కలిసిన విలీన మండలాలకు చెందిన పోలవరం నిర్వాసితులు కూనవరం మండలం జగ్గవరం, మరిగూడెం సర్పంచ్‌లు కారెం పార్వతి, చింతల మంజుల నోమాల కొండలరావు, మరియదాసు తదితరులు తమ సమస్యలను వివరించారు. గతంలో ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం రూ 1.15 లక్షలు మాత్రమే ఇస్తున్నారని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ 10.80 లక్షలు ఇచ్చేలా చూడాలని వారు కోరారు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీల అమలులో అమాయకులైన గిరిజనులను మోసం చేస్తు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాకా తమకు న్యాయం చేయాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు