నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

13 Feb, 2015 13:10 IST|Sakshi

గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు రెండువైపులా మోహరించారు. మరోవైపు అధికారులకు బందోబస్తుగా పోలీసులు భారీగా తరలి వచ్చారు. నాగార్జున సాగర్ నుంచి కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం ఉన్నతాధికారులతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మార్చి నెలాఖరుకల్లా సాగర్ కుడికాల్వకు  నీరందించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే వేలాది ఎకరాలకు నష్టం తప్పదని ఆయన ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా