ముఖ్య మంత్రి కార్యక్రమం రద్దు

3 Jan, 2016 13:21 IST|Sakshi

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వెంకటాచలం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆలస్యం అవ్వడంతో.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. వెంకటాచలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లి హ్యాండీక్యాప్‌డ్ కోసం ఏర్పాటు చేసిన నూతన భవన శంకుస్థాపన ముఖ్యమంత్రి చేయాల్సి ఉండగా.. ఆయన లేకపోవడంతో.. కేంద్ర మంత్రే ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేశారు.


 

మరిన్ని వార్తలు