విద్యార్థిని చితక్కొట్టిన టీచర్

21 Nov, 2015 13:09 IST|Sakshi

హోమ్ వర్క్ చేయలేదంటూ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థని విచక్షణా రహితంగా చితక్కొట్టాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. స్థానిక ఏవీఆర్ స్కూల్లో మధు జగన్‌రెడ్డి ఐదవ తరగతి చదువుతున్నాడు. జ్వరం రావడంతో ఓ రోజు స్కూల్‌కు డుమ్మా కొట్టాడు. దాంతో హోమ్ వర్క్ కూడా చేయలేదు. దీనిపై తెలుగు ఉపాధ్యాయుడు వెంకటయ్యకు తీవ్ర కోపం వచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం జగన్‌రెడ్డిని చితక్కొట్టాడు. ఇంటికి వచ్చిన తమ కుమారుడు వీపుపై వాతలు చూసిన తల్లిదండ్రులు శనివారం స్కూల్‌కు వెళ్లి టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు