గవర్నర్‌ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’

18 Jul, 2020 14:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్‌ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 197 క్లాజ్‌ 2 ప్రకారం రెండోసారి  బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా