-

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 23వ రోజు షెడ్యూల్‌ ఇలా..

28 Nov, 2023 10:05 IST|Sakshi

నేడు నెల్లిమర్ల, కైకలూరులో సామాజిక సాధికార యాత్ర 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది.

ఏలూరు జిల్లా:
కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైసీపీ నాయకుల సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్‌ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు.

విజయనగరం జిల్లా:
నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలోని జగన్నాధ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొండవెలగడ గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం నెల్లిమర్ల వరకు ర్యాలీ జరపనున్నారు. 3:00 గంటలకు నెల్లిమర్ల మొయిన్‌ జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు