భక్తులపై దాడి చేసిన సైకో అరెస్ట్

21 Jun, 2014 08:08 IST|Sakshi

తిరుమల :  తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని తిరుపతి క్రైం బ్రాంచ్కు విచారణ నిమిత్తం తరలించారు. ఈనెల 19న తమిళనాడుకు చెందిన గోవింద త్యాగరాజన్ దంపతులపై సైకో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. నిందితుడు దక్షిణామూర్తి తమిళనాడు నాగపట్నం వాసిగా పోలీసులు గుర్తించారు. అతడు మరోసారి అలిపిరి కాలిబాటలో సంచరిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు.

దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు