నల్ల బ్యాడ్జీలతో రావొద్దు: టీటీడీ జేఈఓ

24 May, 2018 19:04 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనంలో టైంస్లాట్‌ కోటా విధింపు విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం, ఆదివారల్లో 30 వేల టోకన్లు, సోమ, శుక్రవాల్లో 20 వేలు, మంగళ,  బుధ, గురువారల్లో 17 వేల టోకన్లు కేటాయింపు జరిగిందని జేఈఓ తెలిపారు.

ఈ నిబంధనలు రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, భక్తులు టైంస్లాట్‌ కౌంటర్లు సౌకర్యాలు సులభంగా  పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆలయం లోపల నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించారు.

స్వామి వారి అభరణాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీనిపై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపరాదంటూ జేఈఓ శ్రీనివాస రాజు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు