‘విశాఖపై తుఫాను ప్రభావం ఉండకపోవచ్చు!’

10 Oct, 2018 17:06 IST|Sakshi
విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో టిట్లీ తుఫాను ప్రభావం అంతగా ఉండకపోవచ్చని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. టిట్లీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో కమాండింగ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 000023 అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. వర్ష ప్రభావం లేకపోయినా రాత్రిపూట గంటకు 140 నుంచి 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. గాలుల ప్రభారం వల్ల పక్కా ఇళ్లకు నష్టం వాటిళ్లవచ్చని, విద్యుత్‌కు అంతరాయం కలగవచ్చని అభిప్రాయపడ్డారు.

చెట్లు పడిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు రాత్రిపూట బయటకు రావద్దని హెచ్చరించారు.  విశాఖలోని ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌టీంలు సిద్ధంగా ఉంచామన్నారు. 11మండలాల్లోని అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. మండల, రెవెన్యూ స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సెలవుల్లో ఉన్నవాళ్లు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.     

మరిన్ని వార్తలు