టుడే న్యూస్‌ రౌండప్‌

15 Aug, 2017 19:15 IST|Sakshi



సాక్షి, హైదరాబాద్‌:
ఓటరుకు రూ.5వేలు ఇచ్చి దేవుడి పటంపై ప్రమాణం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆయన మనుషుల పట్ల ఓటర్లు లౌక్యంగా వ్యవహరించాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. ఆ సందర్భంలో దేవుణ్ని స్మరించుకుని లౌక్యంగా వ్యవహరించాలని, ధర్మానికి మాత్రమే ఓటు వేయాలని, న్యాయాన్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం మూలసాగరంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మూడేళ్లుగా చంద్రబాబు ప్రజలను వంచిస్తున్న తీరును జగన్‌ వివరించారు. మరిన్ని వార్తలు మరోసారి మీకోసం..
<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఇరిగేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్‌..
ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి టీడీపీ నేతలకు సవాలు విసిరారు.

'కాపులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు'
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ తమ కాపు జాతికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదని కాపు ఉద్యమనేత ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నంబర్‌1’
ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నెం1 అని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత 71 స్వాతం‍త్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలోని రాణిమహల్‌లో కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

‘విమోచనం’ జరుపుకోకుండా చేస్తున్నారు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డిలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఎర్రకోటలో పంద్రాగస్టు పండుగ..
దేశ రాజధాని ఢిల్లీలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ముంచెత్తిన విషాదంలోనూ.. వెల్లువెత్తిన దేశభక్తి!
ఒకవైపు విషాదం.. మరోవైపు జాతీయతాస్ఫూర్తి.. వరదలు ముంచెత్తిన అసోంలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యమిది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>
వార్‌ రూమ్‌లో కిమ్‌: 17 నిమిషాల్లో గ్వామ్‌ ముక్కలు!
గ్వామ్‌పై దాడికి కిమ్‌ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన 'వార్‌ రూమ్‌' చిత్రాలను ఆ దేశ మీడియా బయటకు విడుదల చేసింది. ఓ చిత్రంలో గ్వామ్‌ ద్వీపానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్‌పోల్‌
ఒక్క వజ్రం ఆచూకీ ప్రపంచదేశాల పోలీసులకు సవాల్‌గా మారింది. ఫ్రాన్స్‌, లెబనాన్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్‌, రష్యా ఇలా పలు దేశాల పోలీసులు చోరికి గురైన రూ.250 కోట్ల విలువైన పింక్‌ వజ్రాన్ని కనిపెట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.
<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>

వామ్మో జియో ఫోన్‌: ఇక మరింత పతనమే
జియో ఫోన్‌ ఇంకో 15 రోజుల్లో మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌ టెస్టింగ్‌ కూడా ప్రారంభమైంది. జియో ఫోన్‌తో వచ్చే నష్టాలపై దేశీయ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ముందుగానే ఆందోళన వ్యక్తంచేస్తోంది.

ఉద్యోగుల చేతుల్లోకి జియోఫోన్‌
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తొలి బ్యాచ్‌ జియో ఫోన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. బీటా ట్రయల్స్‌కు కోసం ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్‌ను ఎంపికచేసిన యూజర్లకు రిలయన్స్‌ జియో అందిస్తోంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>

శ్రుతి హాసన్‌ కిడ్నాప్‌నకు కుట్ర
శ్రుతి హాసన్‌, ఆమె చెల్లెలు అక్షర హాసన్‌లను కిడ్నాప్‌ చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, విషయం తెలియడంతో ఆ పన్నాగాన్ని ఆపగలిగానని గుర్తుచేసుకున్నారు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌.

అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్‌ టిక్‌ టిక్‌ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>

'ధోని ఎంపికను అలా చూడొద్దు'
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంపికచేయడాన్ని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సమర్ధించుకున్నాడు.

భారత్‌కు ఆఫ్రిది శుభాకాంక్షలు

భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు.

 

మరిన్ని వార్తలు